‘బొకేలు వద్దు.. పుస్తకాలివ్వండి’

2 Aug, 2017 19:38 IST|Sakshi
‘బొకేలు వద్దు.. పుస్తకాలివ్వండి’

లఖ్నవూ(ఉత్తరప్రదేశ్): సమాజంలో ఏ పంక్షన్ జరిగినా అతిథులకు పూల బొకేలు ఇచ్చి ఆహ్వానించటం అనవాయితీ. కానీ అలాంటి అనవాయితీకి స్వస్తి పలకేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అధికారక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రముఖులకు పెద్దపెద్ద పూల గుచ్ఛాలు ఇవ్వద్దంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. స్వాగతం చెప్పే సమయంలో బొకేలకు బదులు ఇకపై ఒక పువ్వును గానీ, పుస్తకాన్ని గాన్నీ ఇవ్వాలని సూచించింది.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని విభాగాలు, శాఖల అదనపు కార్యదర్శులు, ప్రిన్సిపల్ కార్యదర్శులకు బుధవారం ప్రిన్సిపల్ సెక్రటరీ(సమాచార) అవ్నీష్ అవస్తి ఆదేశాలు జారీ చేశారు. పెద్ద బొకేల్లో పూలను కూడా ఎక్కువ సంఖ్యలో వాడుతున్నారు. అవి వాడిన తర్వాత  వృథా అవుతాయని కాబట్టి.. గుచ్ఛాలకు బదులు ఒకటీ రెండు పూలను మాత్రం అందజేయవచ్చని తెలిపారు. అదే విధంగా స్ఫూర్తి దాయకంగా ఉండే పుస్తకాలు, గ్రంథాలను కూడా అందజేయవచ్చని ఆయన వివరించారు.
 

మరిన్ని వార్తలు