షిండేకు రక్షణగా నిలబడ్డ హనుమంతన్న

20 Feb, 2014 16:09 IST|Sakshi
షిండేకు రక్షణగా నిలబడ్డ హనుమంతన్న

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును అనూహ్యంగా లోక్సభలో ప్రవేశపెట్టిన యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలోనూ అదే వ్యూహాన్ని అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేడు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలను కొద్దిసేపు నిలిపివేశారు. అంతేకాకుండా తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన వారిని నియంత్రించేందుకు మార్షల్స్న ప్రయోగించింది. షిండేకు రక్షణగా నిలబడిన మార్షల్స్ ఆందోళనలు చేస్తున్న సభ్యులను అడ్డుకున్నారు.

సీమాంధ్ర సభ్యులతో పాటు సీపీఎం, సమాజ్వాది పార్టీ తదితర పార్టీలకు చెందిన ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ షిండేను చుట్టుముట్టారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వి. హనుమంతరావు.. షిండేకు రక్షణగా నిలబడ్డారు. సీమాంధ్ర, తెలంగాణ సభ్యుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.

మరిన్ని వార్తలు