ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నిట్టనిలువునా చీలుతుంది: రాందేవ్ బాబా

19 Sep, 2013 21:27 IST|Sakshi
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నిట్టనిలువునా చీలుతుంది: రాందేవ్ బాబా
రానున్న లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాజయం తప్పదని యోగా గురువు బాబా రాందేవ్ జోస్యం చెప్పారు. ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువున చీలడం ఖాయం అని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లకే పరిమితం అవుతుంది అని అన్నారు. అంతేకా బీజేపీ అధ్వర్యంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ (ఎన్ డీఏ) అధికారంలోకి వస్తుంది అని అన్నారు. 
 
ఎన్డీఏ కూటమి 300 సీట్లకు పైగా గెలుచుకుంటుంది అని రాందేవ్ బాబా తెలిపారు. ప్రస్తుతం రాజకీయ నేతలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు అని.. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశ రాజకీయాల్లో బలమైన నేతగా ఎదగడమే కాకుండా, ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు అని అన్నారు. 
 
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు