జీవోఎం ముందు 'వట్టి' కోర్కెల చిట్టా

13 Nov, 2013 12:20 IST|Sakshi
జీవోఎం ముందు 'వట్టి' కోర్కెల చిట్టా

హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేయాలని రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్ మంత్రుల బృందానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మంత్రుల బృందం (జీవోఎం) ఎదుట తన కోర్కెల చిట్టా విప్పారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని జీవోఎంను కోరారు.

 

హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రం చేతిలో ఉంచాలని, హైదరాబాద్ రెవెన్యూ ఆదాయంలో 60 శాతం తమకు ఇప్పిస్తారని జీవోఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు.1956కు ముందు ఉన్న రాష్ట్రాన్ని తమకు ఇవ్వగలుగుతార అని జీవోఎంను ప్రశ్నించారు.తమ పార్టీ ఆదేశాల మేరకే నివేదికలిచ్చామని వట్టి ఈ సందర్బంగా గుర్తు చేశారు. తాను సంధించిన ప్రశ్నలను పరిష్కరించి ఆ తర్వాత విభజనపై ముందుకు వెళ్లాలని వట్టి వసంతకుమార్ జీవోఎంకు సూచించారు.

మరిన్ని వార్తలు