అన్ని విషయాల్లో ‘ఏకీకృత’ స్ఫూర్తిని చాటండి

19 May, 2017 02:08 IST|Sakshi
అన్ని విషయాల్లో ‘ఏకీకృత’ స్ఫూర్తిని చాటండి

తెలుగు రాష్ట్రాలకు కేంద్రమంత్రి వెంకయ్య పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ:
ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధ నల అమలు విషయంలో తెలుగు రాష్ట్రాలు చూపిన చొరవ అభినందనీయమని, ఇదే స్ఫూర్తిని రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న అన్ని సమస్యల పరిష్కారంలోనూ చూపాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. టీచర్ల ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపి కేంద్ర హోంశాఖకు పంపగా..రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు బుధవారం కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చిం చిన విషయం తెలిసిందే. దీనిపై వెంకయ్యనాయుడు గురువారం పైవిధంగా స్పందించారు. ‘‘రాష్ట్ర విభజన చారిత్రక సత్యం. గతం గురించి ఆలోచించి బాధపడకూడదు. కలిసుండి కలహించుకోవడం కంటే.. విడిపోయి సహకరిం చుకోవడం మిన్న.

రెండు రాష్ట్రాలమధ్య ఆస్తులు, ఉద్యోగుల పంపిణీలో మూడే ళ్లుగా జాప్యం జరుగుతోంది. వివిధ అంశాలపై ఇరు రాష్ట్రాలమధ్య భిన్నాభి ప్రాయాలుండడమే ఇందుకు కారణం. కలసి కూర్చొని చర్చించుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. 9, 10వ షెడ్యూల్‌లోని ఆస్తుల విభజన, ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజన సమస్యలను చర్చించుకుంటే పరిష్కారమవు తాయి’’ అని పేర్కొన్నారు. కాగా, సర్వీస్‌ రూల్స్‌ అమలు విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడంపై వెంకయ్యనాయుడుకు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు