పార్టీ విస్తరణను మిత్రపక్షం వద్దొంటుందా!

23 Apr, 2017 02:36 IST|Sakshi
పార్టీ విస్తరణను మిత్రపక్షం వద్దొంటుందా!

మూడేళ్ల పాలన సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని విస్తరించుకోవడానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మనం పార్టీని విస్తరించుకుంటామంటే మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్లు మనలను తిరగొద్దంటారా అని ప్రశ్నించారు.

కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తి కావొస్తున్న సందర్భంగా శనివారం కృష్ణా జిల్లా గన్నవరంలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరాని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు, పలువురు రాష్ట్ర పార్టీ నేతలు సభలో పాల్గొన్నారు. సభలో వెంకయ్య మాట్లాడుతూ.. ‘మన పార్టీ నాయకుడు నరేంద్రమోదీ అందరికీ తెలుసు. బీజేపీనే తెలవాలి. మీరు ప్రతి ఇంటి తలుపుతట్టాలి. మేం మోదీ పార్టీ తరఫున వచ్చామంటూ వాళ్లను బీజేపీలో చేరండని ఒప్పించాలి’ అని పార్టీ నేతలకు సూచించారు.

మరిన్ని వార్తలు