ప్రజల మద్దతుతోనే స్వచ్ఛత

24 Dec, 2016 02:28 IST|Sakshi
ప్రజల మద్దతుతోనే స్వచ్ఛత

స్వచ్ఛ సర్వేక్షణ్‌’ కార్యక్రమంలో వెంకయ్య  
సాక్షి, హైదరాబాద్‌: స్వచ్ఛ కార్యక్రమాలు ప్రజల మద్దతుతోనే విజయవంతమవుతా యని, కేవలం పీఎం, సీఎం, మంత్రుల వల్ల పరివర్తన రాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. దీన్ని గుర్తించే ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్‌ను రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చార న్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడి ఎల్‌బీ స్టేడియంలో జరిగిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌.. వావ్‌ హైదరాబాద్‌’ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... రాజకీయ నాయకులు పారదర్శకతతో ఉంటే ప్రజలు మద్దతిస్తారన్నారు.

నిధుల కోసం ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్థానిక సంస్థలే సమకూర్చుకోవాలని, అందుకు గానూ పన్నులు వేయడం అవసరమన్నారు. అయితే... సదుపాయాలు కల్పించాక జరిమా నాలు వేస్తే ఫర్వాలేదు కానీ, అవి లేకుండానే వేస్తే సమయం వచ్చినప్పుడు ప్రజలు రాజకీయ నాయకులకు ఫైన్‌లు వేస్తారన్నారు. తాత్కాలిక దృష్టితో కాకుండా 25 సంవ త్సరాలకు సరిపడా భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు.

స్వచ్ఛాగ్రహిలు కావాలి...
‘స్వచ్ఛ కార్యక్రమం కోసం నాడు స్వాతంత్య్ర సమయంలో సత్యాగ్రహం మాదిరిగా నేడు ప్రజలంతా స్వచ్ఛాగ్రహిలుగా మారాలి. చెత్త తొలగించే పని కూడా ప్రభుత్వానిదేనని భావించరాదు. స్వచ్ఛభారత్‌కు బాగా కృషి చేసే కార్పొరేటర్లకు 10శాతం నిధుల్ని ప్రోత్సా హకంగా ఇస్తాం. పనిచేయని వారికి 10 శాతం తగ్గిస్తాం’ అని వెంకయ్యనాయుడు చెప్పారు. మార్పు అంటే కేవలం మ్యాపుల్ని మార్చడం కాదని, ప్రక్షాళన చేయడమని, ప్రధాని మోదీ ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారన్నారు. తొలుత మనసులు పరిశుభ్రమైతే.. తర్వాత భాగ్య నగరం శుభ్రమవుతుందన్నారు. జనాకర్షక పథకాలతో సమస్యలు పరిష్కారం కావని, ప్రజల శక్తిసామర్థా్థ్యలను వినియోగించి ఉత్పాదక శక్తి పెంచాలని పిలుపునిచ్చారు. మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... చెత్త నుంచి విద్యుత్‌ ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించేలా సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు.

కార్పొరేట్‌ సంస్థల విరాళాలు..
స్వచ్ఛ కార్యక్రమాల అమలుకు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద రామ్‌కీ సంస్థ రూ.2 కోట్లు, కామినేని కోటి రూపాయల విరాళాలు అందజేశాయి.  

ఈసారి టాప్‌–5లో...
రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ... స్వచ్ఛభారత్‌ స్ఫూర్తితో స్వచ్ఛహైదరాబాద్‌ అమలుకు ఏ నగరం చేయని విధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత ఏడాది స్వచ్ఛ ర్యాంకుల్లో 19 స్థానంలో ఉన్న హైదరాబాద్‌ ఈసారి తొలి ఐదు స్థానాల్లో నిలవగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.తెలంగాణలోని 73 యూఎల్‌బీల్లో నూ స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టామన్నారు. సమావేశంలో పలువురు మంత్రులు, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు