ఇక వైబ్రేషన్ తోనే ఫోన్ ఛార్జింగ్!

22 Feb, 2014 22:58 IST|Sakshi

న్యూయార్క్: ఏదైనా వాహనంలో వెళుతున్నప్పుడు మన వద్ద నున్న స్మార్ట్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే ఎంతో సతమవుతూ ఉంటాం. ఆఫీస్ కి వెళ్లే సమయంలోనో.. ఇంటికి వెళ్లే సమయంలోనో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఇదే పరిస్థితి దాపురిస్తే ఎంతో మదనపడుతుంటాం. ఇక నుంచి ఆ బాధలను విముక్తి చేసేందేకు ఇంజనీర్లు వినూత్న ఛార్జింగ్ విధానాన్ని అభివృద్ది చేశారు. రైలు, బస్సు, బైక్..వాహనం ఏదైనా గానీ ఛార్జింగ్ అయిపోయినా సెల్ ఫోన్ కు వైరు లేకుండా ఛార్జింగ్ అయ్యే పద్ధతిని త్వరలో మనముందుకు తీసుకురానున్నారు. ఎలాంటి విద్యుత్ వైరూ అవసరం లేని నానో-జనరేటర్‌ను సెల్ ఫోన్‌లోనే అంతర్గతంగా అమర్చుతారు.

 

అది సెల్‌ఫోన్ గురయ్యే వైబ్రేషన్ల ద్వారా తనకు తానే విద్యుత్‌ను ఉత్పత్తిచేసుకుని సెల్‌ఫోన్‌ను చార్జ్ చేస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జుడాంగ్ వాంగ్,  చైనాలోని సన్ యట్‌సేన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిన్నొసెటా శాస్త్రవేత్తల బందం దీనిని ఆవిష్కరించారు. ఈ నానో-జనరేటర్ ద్వారా వ్యక్తిగత ఎలక్ట్రానిక్ వస్తువులు తనకు తానుగానే ఛార్జింగ్ చేసుకునేందుకు కొత్త పరిష్కారం లభిస్తుందని వాంగ్ తెలిపారు.

మరిన్ని వార్తలు