తల్లి కాబోతున్న టెన్నిస్ బ్యూటీ!

16 Jul, 2016 11:30 IST|Sakshi
తల్లి కాబోతున్న టెన్నిస్ బ్యూటీ!
బెలారస్ టెన్నిస్ బ్యూటీ, ప్రపంచ ఆరో ర్యాంకు క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా గుర్తుంది కదా.. 2012, 2013 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు గెలుపొందిన ఈ సుందరి మోకాలి గాయం కారణంగా ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో పాల్గొనలేదు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఈ సుందరికి వైద్యులు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ప్రియుడితో సహాజీవనం చేస్తున్న ఆమె త్వరలో తల్లి కాబోతున్నది. 
 
ఈ విషయాన్ని అజరెంకా తన ఫేస్‌బుక్‌ పేజీలో వెల్లడించింది. ‘రోలాండ్ గ్యారోస్‌లో అయిన మోకాలి గాయం నుంచి ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మా వైద్యుడు ఓ వార్త తెలిపారు. నేను- నా బాయ్‌ప్రెంఢ్ త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నాం. ఈ ఏడాది చివర్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నాం’ అని అజరెంకా తెలిపింది. ఈ నేపథ్యంలో తానే ఎంతగానో ప్రేమించే టెన్నిస్‌కు కొంతకాలం దూరమయ్యే అవకాశముందని పేర్కొంది. అయితే, గతంలో ఎంతోమంది మహిళా ఆథ్లెట్లు పిల్లల్ని కన్న తర్వాత మళ్లీ క్రీడల్లోకి ప్రవేశించి సత్తా చాటారని, వారి నుంచి స్ఫూర్తి పొంది తాను అదే చేయాలనుకుంటున్నానని అజరెంక తెలిపింది.  
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు