9 ఏళ్లక్రితం ఆయన...ఇపుడు వినోద్‌జీ

27 Apr, 2017 13:11 IST|Sakshi
9 ఏళ్లక్రితం ఆయన...ఇపుడు వినోద్‌జీ

ముంబై: సుమారు 100పైగా సినిమాల్లో నటించి  బాలీవుడ్‌ సినీ చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్‌  నటుడు, యాక్టివ్‌ పోలిటీషియన్‌ వినోద్‌ ఖన్నా (70) ఇక లేరన్న వార్త తో బాలీవుడ్‌   విషాదంలో మునిగిపోయింది.  శ్వాసకోశ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినోద్‌ ఖన్నా  గురువారం  ఉదయం 11.20గంగలకు అంతిమ శ్వాస  విడిచారని  హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి.తీవ్ర అనారోగ్యంతో  ఏప్రిల్లో మొదటి వారంలో సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటలో  చేరారు.   తమ అభిమాన, సహచర  నటుడు కన్నుమూతతో  బాలీవుడ్‌  గుండె బరువెక్కింది. అ‍శ్రునయనాలతో ఆయనకు నివాళులర్పించారు. 

ముఖ‍్యంగా కేంద్రమంత్రి, నటి స్మృతి ఇరాని  వినోద్‌ ఖన్నా ఆకస్మిక మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.   ఆయన  సిరీస్‌ను  ప్రొడ్యూస్‌ చేసినగౌరవం తనకు దక్కిందని ఆమె గుర్తు చేసుకున్నారు.  బాలీవుడ్‌ మరో సీనియర్‌ నటుడు రిషీకపూర్‌ అమర్‌ అ‍క్బర్‌, ఆంటోనీ సినిమాలో అమర్‌  పాత్ర పోషించిన వినోద్‌కు  ట్విట్టర్‌ ద్వారా సంతాపం ‍ ప్రకటించారు.  ప్రముఖ గాయని ఆశాభోంస్లే హీరోయిన్‌ రాధిక, రిచా చద్దా తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు.

 పంజాబ్‌ గురుదాస్పూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు  బీజీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  ‘‘మేరె అప్నే’ "ఇన్సాఫ్" "అమర్, అక్బర్ ఆంటోనీ, లాంటి  సినిమాలతో ఆయన పాపులర్‌ అయ్యారు.  వినోద్‌ ఖన్నా మరణంపై సినీ ట్రేడ్‌  ఎనలిస్ట్‌   తరుణ ఆదర్శ్‌ సంతాపం ప్రకటించారు.  2015లో షారూక్‌ సినిమా  దిల్‌వాలే ఆయన నటించిన ఆఖరి సినిమా.  ఖుర్బానీ, దయావన్‌ మూవీలలో  వినోద్‌ ఖన్నాతో కలిసి నటించిన ఫిరోజ్‌ఖాన్‌  తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజున( ఏప్రిల్‌ 27)  మరణించారని, ఇపుడు వినోద్‌ ఖన్నా ఇదే రోజున కోల్పోవడం బాధాకరమన్నారు.

కాగా  అక్టోబర్‌ 6, 1946లోజన్మించిన ఆయన 1968లో సినీ కరియర్‌ ను ప్రారంభించారు.  అమర్‌ అక్బర్‌ ఆంటోనీ, ది బర్నింగ్‌ ట్రైన్‌ లాంటి  చిత్రాలలో నటించారు.  1982లో ఓషో రజనీష్‌ ప్రభావంతో  ఫిలిం ఇండస్ట్రీని  వీడాలని నిర్ణయించుకున్నారు. అయితే  అయిదేళ్ల తరువాత ఇన్సాఫ్‌, సత్యమేవ జయతే చిత్రాలో సినీరంగాని  తిరిగి  చేరువయ్యారు. వినోద్‌ ఖన్నాకు భార్య ,  ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.


 

మరిన్ని వార్తలు