ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్

28 Dec, 2016 14:51 IST|Sakshi
ఆర్బీఐకి కొత్త డిప్యూటీ గవర్నర్
ముంబాయి : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉర్జిత్ పటేల్ పదోన్నతి పొందడంతో, అప్పటినుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీ గవర్నర్ పోస్టులోకి కొత్త వ్యక్తిని ప్రభుత్వం ఎంపిక చేసింది. న్యూయార్క్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా చేస్తున్న బిరాల్ వీ.ఆచార్యను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమించింది. దీంతో ఉర్జిత్ పటేల్ డిప్యూటీ గవర్నర్ స్థానంలోకి బిరాల్ వీ. ఆచార్య వచ్చేశారు. ఆర్బీఐకి మొత్తం నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. నలుగురిలో ఒకరిగా ఆచార్యను ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. 
 
అయితే ఆచార్యకు ఏ పోర్ట్ఫోలియో ఇస్తున్నారో ప్రభుత్వం తెలుపలేదు. ఉర్జిత్ డిప్యూటీ గవర్నర్గా ఉన్నంతవరకు ఆర్బీఐకి ఎంతో కీలకమైన ద్రవ్యపరపతి విధానానికి బాధ్యతలు నిర్వర్తించేవారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను మరో డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ పర్యవేక్షిస్తున్నారు. బ్యాంక్స్ రెగ్యులేషన్, కార్పొరేట్ ఫైనాన్స్, క్రెడిట్ రిస్క్, అసెట్ ప్రైసింగ్లపై ఆచార్య ఎక్కువగా రీసెర్చ్లు చేస్తూ ఉంటారు.   
మరిన్ని వార్తలు