అది విరాట్ కోహ్లి అదృష్టం: గ్రెగ్ చాపెల్

27 Jun, 2016 17:28 IST|Sakshi
అది విరాట్ కోహ్లి అదృష్టం: గ్రెగ్ చాపెల్

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేయడంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్ హర్షం వ్యక్తం చేశాడు. ప్రస్తుత టీమిండియా జట్టుకు  అనిల్ కుంబ్లేను కోచ్ గా చేయడమే సరైనదిగా చాపెల్ అభిప్రాయపడ్డాడు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి-కోచ్ అనిల్ కుంబ్లేల కలయికలో టీమిండియా మరింత శక్తిమంతంగా రూపుదిద్దుకోవడం ఖాయమని చాపెల్ పేర్కొన్నాడు.


 'టీమిండియా కోచ్గా కుంబ్లే నియామకం సరైనదే. కుంబ్లేతో కలిసి పని చేయడం విరాట్కు దక్కిన అదృష్టం.  కుంబ్లేతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం పంచుకోవడం విరాట్ కు దక్కిన ఒక మంచి అవకాశం కూడా. విరాట్ దూకుడుకు  అపారమైన కుంబ్లే అనుభవం సహాయ పడుతుంది. వీరిద్దరి భాగస్వామ్యం కచ్చితంగా భారత జట్టును ముందుకు తీసుకెళుతుంది. కుంబ్లే-విరాట్ల కాంబినేషన్ విజయవంతమవడం ఖాయం. కుంబ్లే నుంచి విరాట్ కు చక్కటి సహకారం దక్కుతుంది.  ప్రతీ విషయంలోనూ విరాట్ ను కుంబ్లే వెనుకే  ఉండి ప్రోత్సహిస్తాడు ' అని ఓ జాతీయ పత్రికకు రాసిన కాలమ్లో గ్రెగ్ చాపెల్ పేర్కొన్నాడు. గతంలో తాను టీమిండియా కోచ్ గా పని చేసినప్పుడు కుంబ్లే పోరాటపటిమను అత్యంత దగ్గరగా చూశానని చాపెల్ తెలిపాడు. ఎంతో అంకితభావం గల కుంబ్లే భారత కోచ్ గా రాణిస్తాడని పేర్కొన్నాడు.
 

మరిన్ని వార్తలు