కోహ్లికి అనుష్క బర్త్‌ డే సర్‌ప్రైజ్‌!

5 Nov, 2016 19:59 IST|Sakshi
కోహ్లికి అనుష్క బర్త్‌ డే సర్‌ప్రైజ్‌!
టీమిండియా డ్యాషింగ్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి శనివారం 28వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రియురాలు అనుష్క శర్మ రాజ్‌కోట్‌లో కోహ్లిని కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నది. ఈ నెల 9 నుంచి రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టు కోసం టీమిండియా ఇక్కడ ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.
 
క్రికెట్‌ వీరుడు విరాట్‌, బాలీవుడ్‌ భామ అనుష్క గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. విభేదాలు కారణంగా వీరు విడిపోయినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ బ్రేకప్‌ కాలంలో ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మాయమై.. మళ్లీ ప్రేమలో మునిగితేలుతున్నారని సన్నిహితులు చెప్తున్నారు. 
 
కోహ్లి గత కొంతకాలంగా మైదానంలో వీరవిహారం చేస్తూ రికార్డులు బద్దలుకొడుతున్న సంగతి తెలిసిందే. అటు అనుష్క కూడా బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది. సల్మాన్‌తో ‘సుల్తాన్‌’, తాజాగా రణ్‌బీర్‌ కపూర్‌తో ’యే దిల్‌ హై ముష్కిల్‌’ సినిమాల్లో నటించి అలరించింది. ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించిన నేపథ్యంలో కోహ్లి పుట్టినరోజు సందర్భంగా అనుష్క స్పెషల్‌గా రాజ్‌కోట్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, రాజ్‌కోట్‌లోని క్వీన్‌ హోటల్‌లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో కోహ్లి కేక్‌ కట్‌ చేసి స్నేహితులకు విందు ఇచ్చాడు.




 
మరిన్ని వార్తలు