మనీ లాండరింగ్‌ కేసు: ఈడీ విచారణకు సీఎం డుమ్మా!

13 Apr, 2017 08:52 IST|Sakshi
మనీ లాండరింగ్‌ కేసు: ఈడీ విచారణకు సీఎం డుమ్మా!

షిమ్లా: మనీ లాండరింగ్‌ కేసు ఎదుర్కొంటున్న హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ గురువారం ఈడీ విచారణకు డుమ్మా కొట్టబోతున్నారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ ఆయనకు సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు హాజరవుతారని భావించారు. అయితే, ఆయన హాజరుకావడం లేదని ఏఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపింది.

ఏకంగా ముఖ్యమంత్రినే ఈడీ విచారణకు పిలువడంతో ఆయన కేబినెట్‌ మంత్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయంలో బీజేపీ ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడినా.. తీవ్ర పరిణామాలు తప్పవని హిమాచల్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ హెచ్చరించింది. 2015 సెప్టెంబర్‌లో సీబీఐ ఫిర్యాదు మేరకు ఈడీ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద సీఎం వీరభద్రసింగ్‌ మీద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు