‘వ్యాపమ్’ దర్యాప్తునకు 40 మందితో సీబీఐ బృందం

13 Jul, 2015 01:11 IST|Sakshi

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ కుంభకోణంపై దర్యాప్తు చేయటానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం 40 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారి సారథ్యంలోని ఈ బృందం సోమవారం భోపాల్ చేరుకుని దర్యాప్తు స్వీకరిస్తుందని.. సీబీఐ మీడియా సమాచార అధికారి ఆర్.కె.గౌర్ తెలిపారు.

వ్యాపమ్ కుంభకోణం పైనా, ఆ కుంభకోణానికి సంబంధించిన వారి అసహజ మరణాలపైనా సీబీఐ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు గత గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే. సీబీఐ ఈ దర్యాప్తుపై ఈ నెల 24వ తేదీలోగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది.
 

>
మరిన్ని వార్తలు