ఆవిష్కరణలు కోరుకుంటున్నారు..

26 Mar, 2015 00:52 IST|Sakshi
ఆవిష్కరణలు కోరుకుంటున్నారు..

సెనెకా గ్లోబల్ ఎండీ రావు తుమ్మలపల్లి
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గతంలో క్లయింట్లు నిర్ధేశించిన పని చే స్తే చాలు. ఇప్పుడలా కాదు. ప్రధానంగా ఐటీ కంపెనీల నుంచి క్లయింట్లు వినూత్న ఆవిష్కరణలు కోరుకుంటున్నారని సెనెకా గ్లోబల్ ఎండీ రావు తుమ్మలపల్లి తెలిపారు. కంపెనీ ప్రెసిడెంట్ ఎడ్ జోఫర్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.

సేవలందించే కంపెనీని భాగస్వామిగా భావిస్తున్నారని, మరింత ఉత్పాదకత ఆశిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు అమెరికా కార్యకలాపాలకు వచ్చే మూడేళ్లలో రూ.31 కోట్లు వ్యయం చేస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే నూతన భవనంలోకి కార్యాలయాన్ని మారుస్తున్నట్టు తెలిపారు. దశలవారీగా దీనిని విస్తరిస్తామన్నారు. అమెరికా మార్కెట్ లక్ష్యంగా ఐటీ సేవలందిస్తున్న సెనెకా గ్లోబల్‌కు ప్రస్తుతం హైదరాబాద్ కార్యాలయంలో 220 మంది ఉద్యోగులు ఉన్నారు. 2020 నాటికి ఈ సంఖ్యను 2 వేలకు చేరుస్తామని ఆయన పేర్కొన్నారు. వీరిలో 90 శాతం మంది భారతీయులు ఉంటారని వివరించారు. 2015 నుంచి కంపెనీల కొనుగోళ్లపై దృష్టిసారిస్తామన్నారు. కంపెనీ 2014-15లో రూ.55 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తోంది.
 
 

మరిన్ని వార్తలు