మెదడులోనూ సమాచార సమన్వయం

21 Jan, 2014 00:47 IST|Sakshi
మెదడులోనూ సమాచార సమన్వయం

వాషింగ్టన్: ఏదైనా ఒక అంశంపై దృష్టి కేంద్రీకరించడానికి మెదడులోని పలు ప్రాంతాలు పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటాయని వాషింగ్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. అందువల్లే మెదడుకు స్ట్రోక్ వచ్చినవారుగానీ, మెదడులోని భాగాలు దెబ్బతిన్నవారుగానీ దేనిపైనా దృష్టి సారించలేరని వారు చెబుతున్నారు.
 
 ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త అమీ డాయిచ్ మాట్లాడుతూ.. సెల్‌ఫోన్లలో కాన్ఫరెన్స్ తరహాలో ఒకేసారి అన్నింటి మధ్యా ప్రత్యేక సమాచార ప్రసారం జరుగుతుందని, ఆ సమాచారాన్ని మెదడులోని ప్రాంతాలు విశ్లేషించి తగిన ఆదేశాలిస్తాయని తెలిపారు. అందువల్లే ఏదైనా అంశంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరణ సాధ్యమవుతుందన్నారు. కొందరు రోగుల మెదడుకు తాత్కాలికంగా ఎలక్ట్రోడ్‌లను అమర్చి పరిశీలించగా.. ఈ విషయం వెల్లడైందన్నారు. తమ పరిశోధన ఆధారంగా మెదడు దెబ్బతిన్న, స్ట్రోక్ వచ్చిన రోగులకు సరికొత్త చికిత్సలను రూపొందించవచ్చని చెప్పారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా