జానారెడ్డిని మార్చం

11 Jul, 2015 14:21 IST|Sakshi
జానారెడ్డిని మార్చం

హైదరాబాద్: తెలంగాణ సీఎల్పీ నేతగా జానారెడ్డి మార్చే ఉద్దేశం లేదని ఏఐసీసీ నేత కుంతియా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాను ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి అభిప్రాయాన్నిసేకరించలేదన్నారు.  డీఎస్  వంటి వారు అధికారం కోసం పార్టీ మారుతున్నారని, ఆయన మారడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఏఐసీసీ నేత కుంతియా విమర్శించారు.   
 
తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామని కుంతియా వెల్లడించారు. ఇందుకోసం విరాళాలు  సేకరిస్తామన్నారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకున్నామని,  ఈ నెలాఖరుకల్లా  ఈ కార్యక్రమం దాదాపు 25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 24న రాహుల్ గాంధీ అనంతపురంలో రాహుల్ పర్యటిస్తారని తెలిపారు.  సుమారు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే వరంగల్ ఉపఎన్నికల్లో పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మీరాకుమార్ ప్రస్తావన రాలేదన్నారు. రంజాన్ సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ము స్లిం సోదరులకు ఇప్తార్ విందులను ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు