సమస్యల్ని చెప్పకోవడానికి జీవోఎం పిలవలేదు:జేడీ శీలం

3 Dec, 2013 19:59 IST|Sakshi
సమస్యల్ని చెప్పకోవడానికి జీవోఎం పిలవలేదు:జేడీ శీలం

ఢిల్లీ: తమ ప్రాంత సమస్యల్ని చెప్పడానికి వస్తే జీవోఎం నుంచి పిలుపు అందలేదని జేడీ శీలం తెలిపారు. కేబినెట్లో తెలంగాణ అంశం చర్చకు వస్తే ముగ్గురు సీమాంధ్ర మంత్రులు తమ అభిప్రాయాలను చెబుతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన జేడీ శీలం..జీవోఎం తమ అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం ఇవ్వలేదన్నారు. ఒకప్రక్క విభజన ప్రక్రియ జరుగుతుంటే సమైక్య రాష్ట్రం అని ఏమి చేయగలమన్నారు. జీవోఎం ఇప్పటి వరకూ ఏం చేయాలనుకుంటుందో తమకు చెప్పలేదన్నారు.

 

ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో గల హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారథ్యంలో మంగళవారం సాయంత్రం జీవోఎం సమావేశమైంది. విభజన అంశం చివరి అంకానికి చేరడంతో జీవోఎం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, ఆంటోని,పి. చిదంబరం, నారాయణ స్వామి, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్ లు హాజరైయ్యారు.

 

 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా