అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తాం:బిజూ జనతాదళ్

10 Dec, 2013 21:03 IST|Sakshi

ఢిల్లీ:యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు ఉంటుందని బిజూ జనతాదళ్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి తప్పకుండా మద్దతు తెలుపుతామని ఆ పార్టీ నేత, ఎంపీ జయపాండ వెల్లడించారు. లోక్సభలో బిజూ జనతాదళ్కు 14 మంది ఎంపీల ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన అవిశ్వాసం-యూపీఏ సర్కారు అంశంపై మీడియాతో మాట్లాడారు.. యూపీఏ విధానాలపై తాము మొదటి నుంచి వ్యతిరేకమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి మాత్రం జయ పాండా నోరు మెదపలేదు.
 

ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతో.. ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు.. సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు అందించారు. కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్ సోమవారం ఉదయం ఈమేరకు స్పీకర్ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా యూపీఏపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడింది.

మరిన్ని వార్తలు