మీ మాట వినేందుకు వస్తున్నాం!

4 Sep, 2016 10:21 IST|Sakshi
మీ మాట వినేందుకు వస్తున్నాం!

న్యూఢిల్లీ: గత 58 రోజులుగా కశ్మీర్‌ లోయ రగులుతూనే ఉంది. హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ తర్వాత లోయలో చెలరేగిన అల్లర్లు తీవ్ర ఉద్రిక్తతను రేపాయి. ఈ అల్లర్లలో 73 మంది మరణించారు. మరోవైపు కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం కనుగొనే లక్ష్యంతో అఖిలపక్ష బృందం ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌ బయలుదేరింది. అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, గులాం నబీ ఆజాద్‌, శరద్‌ యాదవ్‌, రాంవిలాస్‌ పాశ్వన్‌ తదితర నేతలు ప్రత్యేక విమానంలో శ్రీనగర్‌ బయలుదేరారు.

కశ్మీరీలతో మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకొని, రాజ్యాంగం పరిధిలో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు, కశ్మీర్‌ లోయలో ఉద్రిక్తతకు, హింసకు చరమగీతం పాడే లక్ష్యంతో అఖిలపక్షం ఉంది. అఖిలపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిలపక్ష బృందంతో చర్చలు, సమాలోచనలు కశ్మీర్‌కు, దేశానికి మేలు చేస్తాయని అన్నారు. సమస్యకు ఇప్పటికిప్పుడు పరిష్కారం దొరకపోయినా కశ్మీరీ ప్రజలు, పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు అఖిలపక్ష బృందం వేదికగా నిలుస్తుందని చెప్పారు.

మరిన్ని వార్తలు