నటుల ఆత్మహత్యలకు వెబ్‌సైట్లే కారణం: చంద్రబోస్

9 Jan, 2014 03:02 IST|Sakshi
నటుల ఆత్మహత్యలకు వెబ్‌సైట్లే కారణం: చంద్రబోస్

గుత్తి, న్యూస్‌లైన్: సినీ నటుల ఆత్మహత్యలకు కొన్ని వెబ్‌సైట్లు కారణమవుతున్నాయని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా గుత్తిలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఆధారాలు లేకుండానే నటులపై గాసిప్స్ ప్రచారం చేస్తున్నాయని, చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపుతూ వేదనకు గురిచేస్తున్నాయన్నారు.
 

మరిన్ని వార్తలు