బెంగాలీ మహిళపై బీహార్లో సామూహిక అత్యాచారం

24 Sep, 2013 14:10 IST|Sakshi

బీహార్లోని పాట్నా జిల్లాలో ఓ బెంగాలీ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు మంగళవారం తెలిపారు. బీహార్ సరిహద్దుల్లోని బలరాంపూర్ గ్రామానికి చెందిన బాధితురాలు రోడ్డుపక్కన తీవ్రగాయాలతో రోడ్డు పక్కన పడి ఉంది. అటువైపు నుంచి వెళ్తున్న జాతీయ విపత్తు నివారణ బృందం అధికారులు ఆమెను గమనించి కాపాడినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

సుమారు 30 ఏళ్ల వయసులో ఉన్న ఆ బెంగాలీ మహిళ సామూహిక అత్యాచారానికి గురైనట్లు పాట్నా సీనియర్ ఎస్పీ మను మహరాజ్ తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక ఆస్పత్రిలోని వైద్యులు నిర్ధారించారన్నారు. నలుగురైదుగురు వ్యక్తులు తనపై అత్యాచారం చేసినట్లు ఆస్పత్రి సమీపంలో పనిచేస్తున్న ఓ తాపీమేస్త్రీ సహాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసిందని చెప్పారు. కోల్కతాలోని హౌరా రైల్వే స్టేషన్లో తాను తన భర్తతో గొడవపడి వేరే ఏదో రైలు ఎక్కేసినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. ఈ కేసులో పోలీసులు ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

మరిన్ని వార్తలు