రిషితేశ్వరి రెండో డైరీలో ఏం రాసిందంటే..!

16 Aug, 2015 21:29 IST|Sakshi
రిషితేశ్వరి రెండో డైరీలో ఏం రాసిందంటే..!

గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్కు గురై ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసు మరో మలుపు తిరిగింది. రిషితేశ్వరి రాసుకున్న రెండో డైరీ 'సాక్షి టీవీ' చేతికి చిక్కింది. ఆ డైరీలో ఆమె అనుభవించిన చిత్రవధ మొత్తాన్ని వివరించింది. యూనివర్సిటీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, చేదు అనుభవాలను ఆమె తన డైరీలో ఇలా రాసుకుంది....

*  ఫ్రెషర్స్ డే పార్టీ రోజు నాకు మిస్ ఫర్ఫెక్ట్ అవార్డు ఇచ్చారు.
* మిస్ ఫర్ఫెక్ట్ అవార్డును శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు.
* ఆ సమయంలో షేక్ హ్యాండ్ ఇస్తూనే అతను నా నడుం మీద చేయి వేశాడు.
* స్టేజి దిగి క్రిందకు వస్తుంటే జయచరణ్ నాతో అసభ్యంగా వ్యవహరించాడు.
* ఆ సమయంలో జయచరణ్ ఫుల్గా మందు తాగి ఉన్నాడు.
* శ్రీనివాస్తో ఫోన్ చేయమని, జయచరణ్తో మాట్లాడమని హనీషా పదేపదే కోరేది.
* కాదన్నందుకు హనీషా నన్ను ర్యాగింగ్ చేసింది.
* తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీనివాస్ను కలిశాను. నన్ను చూసి హీరోయిన్లా ఉన్నావన్నాడు.
* తర్వాత రోజు నుంచి శ్రీనివాస్ నాతో ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు.
* అతని మెసేజీలన్నీ నన్ను ఇష్టపడుతున్నట్లుగానే ఉంటున్నాయి. నాకు చిరాకేస్తోంది.
* అతనితో చాటింగ్ చేయాలని కానీ, మాట్లాడాలని కానీ లేదు.
* తర్వాత కాలేజీలో అభిషేక్, ఆదిత్య పరిచయమయ్యారు. వారు మంచి ఫ్రెండ్స్ అని బ్రదర్స్ అని ఫీలయ్యాను.
* అయితే దసరా సెలవుల సమయంలో ఆదిత్య నాకు ప్రపోజల్ చేశాడు. నేను నో అని చెప్పా.
* శ్రీనివవాస్ను ఒకసారి సార్ అని పిలిస్తే.. సర్ కాదు.. శ్రీ అని పిలవమన్నాడు.
* శ్రీనివాస్ ఫోన్ చేస్తే ఓసారి నా ఫ్రెండ్తో నేను లేనని చెప్పించా.
* తర్వాత క్లాస్ రూమ్కు వచ్చి నీ ఫోన్ ఎక్కడుందని అడిగాడు.
* నా ఫ్రెండ్కి ఇచ్చానని చెప్తే.. అయితే తీసుకుని నాకివ్వు. వారం తర్వాత ఇస్తానన్నాడు.
* శ్రీనివాస్ వేషాలను తట్టుకోలేక అతనితో గట్టిగా వాదించాను. తర్వాత అతను కొద్దిరోజులు దూరంగా ఉన్నాడు.
* అదే సమయంలో జయచరణ్ ఎంటరయ్యాడు. నావెంట పడుతున్నాడు.
* నేను మంచి ఫ్రెండ్ అనుకున్న అభిషేక్ కూడా నాకు ప్రపోజల్ చేశాడు. అతనొక స్టుపిట్.
* శ్రీనివాస్కు దూరంగా ఉంటున్నానని, అతను నా గురించి నా క్లాస్మెట్స్ దగ్గర ఎంక్వయిరీ చేస్తున్నాడు.
* ఎన్నో ఆశలు, ఆశయాలతో నాగార్జున యూనివర్సిటీలో అడుగు పెట్టా. కానీ ఇది ఇక్కడి ఆర్కిటెక్చర్ కాలేజీ వరెస్ట్ కాలేజీ.
* ఇక్కడి స్టూడెంట్స్లో చాలామంది వరెస్ట్ గాళ్లే. చాలామంది అబ్బాయిలు నాకోసం ట్రై చేస్తున్నారు.
* నా జీవితం మీద విరక్తి కలుగుతోంది. నేను అనుకున్నదొకటి.. జరుగుతోందొకటి.
* అన్నీ నాన్నతో చెప్పుకునే నేను.. ఈ విషయాలు చెప్పుకోలేకపోతున్నా.
* ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావటం లేదు.
* ఫ్రెషర్స్ డే పార్టీ రోజు చరణ్ ఫుల్లుగా తాగి డిన్నర్ సమయంలో తన పక్కన కూర్చోమన్నాడు.
* ఎలా పడితే అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయా. అక్కడున్నుంచి ఎలా తప్పించుకోవాలా? అని ఆలోచించా.
* నా ఫోన్ లాక్కుని నా నెంబర్లు, ఫోటోలు, వివరాలన్నీ చూశాడు. నాకైతే చచ్చిపోవాలనిపించింది.

మరిన్ని వార్తలు