గెలాక్సీ నోట్ 7 ఎలా రీప్లేస్ చేసుకోవాలి?

16 Sep, 2016 12:39 IST|Sakshi
గెలాక్సీ నోట్ 7 ఎలా రీప్లేస్ చేసుకోవాలి?

చార్జింగ్ పెడుతున్నపుడు బ్యాటరీ పేలుతున్న ప్రమాదాలతో శాంసంగ్  భారీ సంకోభంలో చిక్కుకుంది. దీంతో తన కొత్త స్మార్ట్ ఫోన్  శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ను ప్రపంచవ్యాప్తంగా రీకాల్ చేస్తోంది.  ఈ నేపపథ్యంలో అమెరికా కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్   యూజర్లకు కొన్ని సూచనలు  చేసింది. ఈ  స్మార్ట్ ఫోన్ కొన్నవారు  రీప్లేస్ లేదా రిఫండ్  చేసుకోవాలని కోరింది.  శాంసంగ్ గెలాక్సీ నోట్ 7  బ్యాటరీ పేలిన ఘటనలు 92  నమోదయ్యాయని తెలిపింది. వీటిల్లో 26  కాలిన ఘటనలు, 55 ఆస్తినష్టం ఘటనలు  రిపోర్ట్ చేసింది. అమెరికా పది లక్షల ఫోన్లను రీకాల్ చేయనున్నట్టు, ఇక్కడి అమ్మకాల్లో 97 శాతం ఎఫెక్ట్ అయినట్టు అమెరికాలోని శాంసంగ్ అధికారులు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఇప్పటికే శాంసంగ్ నోట్ 7ను సొంతం చేసుకున్నవారు రిప్లేస్ మెంట్ లేదా రిఫండ్  ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం

ముందుగా ఫోన్ ఐఎంఈఐ నెంబరును గమనించాలి.  దీన్ని http://samsung.com/us/note7recall అనే వెబ్ సైట్ లో నమోదు చేయాలి. లేదా హాట్ లైన్  నెంబరు  1-844-365-6197 కాల్ చేసి  వివరాలు అందించాలి.  పూర్తిగా నగదు వాపసు కోరవచ్చు. లేదంటే మరో గెలాక్సీ నోట్ 7గానీ, ఎస్7 , ఎస్7 ఎడ్జ్ గానీ రీప్లేస్ అడగవచ్చు. లేదంటే వినియోగదారులు కొనుగోలు చేసిన రీటైల్  స్టోర్లలోగానీ, బెస్ట్ బై లాంటి ఆన్ లైన్ లో కొనుగోలుచేస్తే   ఆయా వ్యాపార కేంద్రాలను  సంప్రదించాలి. శాంసంగ్ నుంచి డైరెక్ట్  కొన్నవారు నేరుగా  కంపెనీని  సంప్రదించాల్సి ఉంటుంది. 

కాగా గ్లోబల్ గా ఈ ఫోన్లను రీకాల్ చేస్తున్నట్టు అధికారికంగా  ప్రకటించిన శాంసంగ్  యూజర్లను క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు