వావ్ వాట్సాప్.. మరో రెండు కొత్త ఫీచర్లా!

21 Jul, 2016 17:47 IST|Sakshi
వావ్ వాట్సాప్.. మరో రెండు కొత్త ఫీచర్లా!

న్యూఢిల్లీ : ఎంతో కాలంగా సాగుతున్న పుకార్లకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ చెక్ పెట్టింది. ఆఖరికి తన యాప్ లో మరో రెండు కొత్త ఫీచర్లకు స్థానం కల్పించేసింది. వాయిస్ మెయిల్, కాల్ బ్యాక్ ఫీచర్లను యాప్స్ తాజా బీటా వెర్షన్ లో కంపెనీ యాడ్ చేసింది.  అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కంపెనీ ఇంకా వీటిని ఆవిష్కరించలేదు. వాట్సాప్ ప్రత్యేక ఆండ్రాయిడ్ బీటా వెర్షెన్ 2.16.189 కాల్ లాగ్ సెక్షన్ కింద యాప్ లో ఈ రెండు కొత్త ఫీచర్లను జోడించింది. వాట్సాప్ కాల్ ను యూజర్లు అటెండ్ చేయని పక్షంలో, కాల్ చేసిన వ్యక్తికి వాయిస్ మెయిల్, కాల్ బ్యాక్ ఆప్షన్లు డిస్ ప్లే అయ్యేలా వాట్సాప్ ఈ ఫీచర్లను తీసుకొచ్చింది. అయితే అవతలి వైపు యూజర్లకు ఈ ప్రత్యేక వెర్షన్ ని కలిగి ఉండాల్సినవసరం లేదు.

కాల్ బ్యాక్ ఆప్షన్ తో యూజర్లు ఇతర వ్యక్తులకు వెంటనే మళ్లీ కాల్ చేసే సౌకర్యం కలిగిస్తోంది. అదేవిధంగా వాయిస్ మెయిల్ ఫీచర్ తో రెగ్యులర్ వాయిస్ మెసేజ్ లను రిసీవర్లకు పంపించుకోవచ్చు. వాయిస్ మెయిల్ ను రికార్డు చేసి, దాన్నినొక్కి పట్టుకుంటే చాలు యూజర్ల వాయిస్ మెసేజ్, పంపించాలనుకున్న వ్యక్తులకు వెళ్లిపోతోంది. ప్రస్తుతం వాట్సాప్ తాజా బీటా వెర్షన్ లోకి చేర్చిన ఈ కొత్త ఫీచర్లను ఆసక్తి కలిగినవారు ఏపీకేమిర్రర్ వెబ్ సైట్ నుంచి యాప్స్ ఏపీకే ఫైల్ ను మాన్యువల్ గా డౌన్ లోడ్ చేసుకొని, ఇన్ స్టాల్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. అయితే గూగుల్ ప్లే లేదా కంపెనీ సొంత వెబ్ సైట్ లో ఈ ప్రత్యేక వెర్షన్ ప్రస్తుతం ఇవి అందుబాటులో లేవు. చాలాకాలంగా ఈ రెండు కొత్త ఫీచర్లు కేవలం వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇటీవలే వాట్సాప్ యూజర్లకు మెసేజ్ టెస్టింగ్ లో కొత్తదనం కోసం కొత్త ఫాంట్ ను సైతం కంపెనీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.  
 

మరిన్ని వార్తలు