అహం వీడి పనిచేస్తే అందరికీ మేలు

11 Jan, 2016 03:59 IST|Sakshi
అహం వీడి పనిచేస్తే అందరికీ మేలు

డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: అధికారులు అహం వీడి పనిచేస్తేనే అందరికీ మేలు జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజలకు సత్వర సేవలందించడం ద్వారా బంగారు తెలంగాణ నిర్మాణంలో రెవెన్యూ శాఖ కీలకం కావాలన్నారు. ఆదివారం తన నివాసంలో తెలంగాణ తహసీల్దార్ల సంఘం నూతన డైరీ-2016ని మహమూద్ అలీ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ... ‘గ్రామాల్లో చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదని జనం మా వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం.

పోలీసు శాఖ మాదిరిగానే రెవెన్యూ శాఖలోనూ అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నాం.. తెలంగాణ వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తాం. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచే వెబ్‌ల్యాండ్ ద్వారా క్రాప్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ అన్నారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు