శశిపై మొట్టమొదట తిరగబడ్డది ఈయనే!

9 Feb, 2017 23:14 IST|Sakshi
శశిపై మొట్టమొదట తిరగబడ్డది ఈయనే!

ఒకప్పుడు జయలలిత నెచ్చెలిగా తెరవెనుక ఉన్న వీకే శశికళ.. ఇప్పుడు జయలలిత మరణంతో తెరముందుకొచ్చి ఎత్తుకు పైఎత్తు వేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఆరితేరిన నేతగా ఆమె రాజకీయ వ్యూహాలు పదునెక్కుతున్నాయి. కానీ, అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకేలో శశికళ అనూహ్యంగా ఎదుగుతుండటంపై మొదట్లోనే వ్యతిరేకత వచ్చింది. శశికళ కుటుంబసభ్యలు అన్నాడీఎంకే తమ పిడికిట్లో తీసుకోవాలని ప్రయత్నిస్తుండటంపై కృష్ణగిరికి జిల్లాకు చెందిన వన్నియార్‌ నేత కేపీ మునుస్వామి మొట్టమొదట తిరుగుబావుటా  ఎగురవేశారు. శశికళ కుటుంబం తీరుపై కేపీ మునుస్వామి బాహాటంగా విమర్శలు చేశారు. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకేలో శశికళకు ఎదురైన మొట్టమొదటి తిరుగుబాటు ఇదే. కానీ, ఆమె ఆయన విషయాన్ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. మునుస్వామిపై చర్యలు కూడా తీసుకోలేదు.

ఇప్పుడు తిరుగుబాటు నేత పన్నీర్‌ సెల్వం రాజకీయ శిబిరంలో మునుస్వామి కూడా చేరారు. ఎస్పీ షణ్ముగనాథన్‌, పీహెచ్‌ పాండియన్‌, సాయిదై దురైస్వామి, సీవీ షణ్ముగం, ఈ మధుసూధన్‌ తదితర నేతలు ఓపీఎస్‌ వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. శశి వర్గంలోని అసంతృప్త, అసమ్మతి ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనేందుకు వీరు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఓ రిసార్ట్‌లో తిష్టవేసిన శశి వర్గంలోని ఎమ్మెల్యేలలో ఒకరైన ఎస్పీ షణ్ముగనాథన్‌ బాత్‌ రూం బ్రేక్‌ అని చెప్పి.. ఝలక్‌ ఇచ్చారు. చాకచక్యంగా శశి వర్గం నుంచి తప్పించుకొని సెల్వం గూటికి చేరుకున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా గుండెదడ, ఇతరత్రా కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నా.. కట్టుదిట్టమైన భద్రత నడుమ, వారు కదలకుండా నిఘా పెట్టినట్టు కథనాలు వస్తున్నాయి.
 చదవండి :
శశికళకు పన్నీర్‌ సెల్వం మాస్టర్‌ స్ట్రోక్‌!

 

మరిన్ని వార్తలు