ఎవరీ అజయ్‌సింగ్?

17 Jan, 2015 11:02 IST|Sakshi
ఎవరీ అజయ్‌సింగ్?

ఢిల్లీ ఐఐటీలో చదువుకున్న అజయ్‌సింగ్... స్పైస్ జెన్ తొలి ప్రమోటర్లలో ఒకరు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్  కార్పొరేషన్‌కు డెరైక్టర్‌గా వ్యవహరించిన అజయ్... బీజేపీకి చాలా సన్నిహితుడు. బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్‌కు సలహాదారుగా పనిచేయటంతో పాటు 2014 సార్వత్రిక ఎన్నికల్లో ‘అబ్‌కీ బార్- మోదీ సర్కార్’ అనే నినాదం రూపకర్త కూడా అజయేనని చెబుతారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో చదివిన అజయ్.. 2005లో లండన్‌కి చెందిన కన్సాగ్రా కుటుంబంతో కలిసి మోదీలుఫ్త్‌ను 2005లో పునరుద్ధరించి, స్పైస్‌జెట్‌గా మార్చారు. అమెరికన్ ఇన్వెస్టరు విల్బర్ రాస్‌తో 80 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయించటంతో పాటు, 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమయంలోనూ స్పైస్‌జెట్‌లోకి పెట్టుబడులు తేగలిగారు.
 
 బాలీవుడ్ సినిమాలంటే తెగ ఇష్టపడే సింగ్.. అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతారు. ‘‘ఆయన స్పైస్‌ను వదిలే సమయానికి సంస్థకు 800 కోట్ల నగదు నిల్వలున్నాయి. ఇపుడు అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గటం వల్ల లాభాలు కూడా పెరగాల్సి ఉన్నా స్పైస్ నష్టాల పాలవుతోంది. అందుకే బొంబార్డియర్ విమానాలను తొలగించి, బోయింగ్-737లకు మాత్రమే పరిమితమవ్వాలన్నది ఆయన ఆలోచన. లాభదాయక రూట్లలో తక్కువ సిబ్బందితో నడిపించి వచ్చే ఏడాదికల్లా సంస్థను లాభాల బాటలోకి తీసుకురావటానికి ఆయన ప్రణాళికలు వేస్తున్నారు’’ అని ఆయన సన్నిహిత వర్గాలు తెలియజేశాయి.   తాజా డీల్ నేపథ్యంలో బీఎస్‌ఈలో స్పైస్‌జెట్ షేరు ధర 10 శాతం పెరిగి రూ.20.50(అప్పర్ సర్క్యూట్) వద్ద క్లోజయింది.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం