పేలుడు పదార్థాలనే మాత్రమే శునకాలు గుర్తిస్తాయట!

2 Mar, 2014 19:38 IST|Sakshi

వాషింగ్టన్: ఏదో అనుమానాస్పద వస్తువు కనబడింది.. లేదా ఓ చోట బాంబు పెట్టినట్లుగా సమాచారం వచ్చింది.. ఏముంది వెంటనే పేలుడు పదార్థాలను గుర్తించే శునకాలను (స్నిఫర్ డాగ్స్)ను వెంటబెట్టుకుని భద్రతా సిబ్బంది వచ్చేస్తారు. అవి వాసన చూసేసి.. బాంబులను గుర్తిస్తాయి. అంతేకాదు.. అసలైన పేలుడు పదార్థాల వాసనకు, అదే తరహాలో ఇతర వాసనలకు మధ్య తేడానూ అవి గుర్తించగలవని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. మరి శునకాలకు ఈ శక్తి ఎలా వచ్చిందనే అంశంపై అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ-పర్దూ యూనివర్సిటీ ఇండియానాపోలిస్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. సాధారణంగా పేలే గుణం లేని కార్బన్ సహిత పదార్థాలు విడుదల చేసే రసాయనాలు ద్వారా కూడా బాంబుల తరహా వాసనను విడుదల చేస్తాయి.  


అలాంటి రసాయనాలతో శునకాలను పరిశీలించినా, అవి మాత్రం అసలైన పేలుడు పదార్థాలనే గుర్తించాయని పరిశోధనకు నేతత్వం వహించిన గూడ్ పాస్టర్ చెప్పారు.

మరిన్ని వార్తలు