అధిష్టానంతో నేరుగా చర్చించి.. పార్టీని కాపాడుకొందాం! : సీమాంధ్ర మంత్రులు

2 Oct, 2013 02:07 IST|Sakshi
అధిష్టానంతో నేరుగా చర్చించి.. పార్టీని కాపాడుకొందాం! : సీమాంధ్ర మంత్రులు

సాక్షి, హైదరాబాద్‌: ‘‘సమైక్య ఉద్యమంలో కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి నష్టం తప్పదు. రాజకీయంగా మనమూ కష్టాలపాలవుతాం. ఈ దశ…లో పార్టీని రక్షించుకొనేందుకు మనమే ప్రయత్నిద్దాం అధిష్టానంతో నేరుగా సంబంధాలు నెరుపుతూ విభజన సమస్యలకు పరిష్కారం చూపిద్దాం. సీమాంధ్రలో పార్టీకి ఇబ్బందులు లేకుండా చూసుకుందాం. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, సేవ్‌ కాంగ్రెస్‌ పేరిట ప్రజల్లోకి వెళ్దాం. ఇందుకోసం ముందుగా, ఉద్యమం కొంతైనా చల్లబడాలి. కేంద్ర మంత్రుల బృందాన్ని రప్పించి కొన్ని భరోసాలు ఇప్పిస్తే ఉద్యమాన్ని కొంత చల్లార్చవచ్చు. కేంద్ర మంత్రి చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఈ బాధ్యత తీసుకోవాలి.’’
 
ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో మంగళవారం భేటీ అరుున… పలువ…ురు సీమాంధ్ర మంత్రులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సవ…ూవేశానికి కేంద్రమంత్రి చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. వ…ుంత్రి ఆనం మంత్రులందరికీ స్వయంగా ఫోన్‌చేసి భేటీకి పిలిచారని సమాచారం. సీమాంధ్ర సమస్యలపై కేంద్రంతో చర్చించే బాధ్యతను చిరంజీవికి అప్పగించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్‌, సీ రామచంద్రయ్య, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, మహీధర్‌ రెడ్డి, బాలరాజు, కొండ్రు మురళీ మోహన్‌ హాజరయ్యారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయంతో ఉద్యమం తీవ్రతరమై ఇబ్బందులు ఎదురవుతున్నా పార్టీ లైన్లోనే వెళ్లాలని ఇటీవలి నిర్ణయానికి అనుగుణంగానే వారు చర్చలు కొనసాగించారు.

 ‘‘ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పటికే సమైక్య ఉద్యమాన్ని భుజాలకెత్తుకోవడంతో పరిస్థితి ఆ పార్టీ వైపే ఏకపక్షమయ్యేలా కనిపిస్తోంది. సమస్యలను కేంద్రంతో పరిష్కరింప చేసి కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకం కలిగించే బాధ్యత తీసుకోవలసిన ముఖ్యమంత్రి, ఏకపక్షంగా వెళ్లుతున్నారు. ఈ పరిస్థితిలో అధిష్టానంతో మంతనాలు సాగించి, సమస్యలు పరిష్కరింపచేశామని చెప్పుకొని …మే ప్రజల్లోకి వెళ్దాం’’ అని మంత్రి ఒకరు ప్రతిపాదించారు. ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి రప్పించాలన్ని సూచన కూడా వచ్చింది. ఈ అంశాన్ని కేంద్ర మంత్రివ…ర్గ సమావేశంలో ప్రధాని దృష్టికి తేవాలని కేంద్రమంత్రి చిరంజీవిని కోరారు. అలాగే పార్టీ అధినేత్రికి కూడా పరిస్థితిని విన్నవించాలని నిర్ణయించారు, ఇక పార్టీలోని ఇతర పెద్దలతో చర్చించే బాధ్యతను బొత్స సత్యనారాయణకు అప్పగించారు. అలాగే మంత్రివర్గ ఉపసంఘంతో ఇకపై చర్చించబోవమంటూ ఏపీఎన్జీఓలు, ఉద్యోగ సంఘాలు ప్రకటించినందున, వారితో మాట్లాడి సమ్మెను విరమింపచేయాల్సిన బాధ్యతను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికే వదిలేయాలని మంత్రులు భావిస్తున్నారు.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా