అపోలో హాస్పిటల్స్ లాభం 83 కోట్లు

11 Feb, 2014 00:56 IST|Sakshi
అపోలో హాస్పిటల్స్ లాభం 83 కోట్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక ఆదాయంలో 16%, నికరలాభంలో 3.5% వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి రూ.81 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ.83 కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఆదాయం రూ.856 కోట్ల నుంచి రూ.993 కోట్లకు పెరిగింది. ఫార్మా ఆదాయం 23% వృద్ధితో రూ.291 కోట్ల నుంచి రూ.357 కోట్లకు చేరుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 8 ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది.

ఈ 8 హాస్పిటల్స్ ద్వారా అదనంగా 1,000 పడకలు జత కానున్నాయి. నెల్లూరు(200 పడకలు), నాసిక్ (125 పడకలు), ఇండోర్(120 పడకలు) వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి రానున్నాయి. గత 12 నెలల్లో 540 ప డకల సామర్థ్యంతో 3 హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేసిన ట్లు అపోలో ఒక ప్రకటనలో పేర్కొంది. 1983లో ప్రారంభమైన అపోలో హస్పిటల్స్ ప్రస్తుతం భారత్‌తో పా టు శ్రీలంక, బంగ్లాదేశ్, ఘనా, నైజీరియా, మారిషస్, ఖతర్, ఒమన్‌లలో ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో అపోలో షేరు నామమాత్ర నష్టంతో రూ. 945 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు