ట్రంప్పై విరుచుకుపడ్డ స్టార్ హీరో

14 Aug, 2016 12:34 IST|Sakshi
ట్రంప్పై విరుచుకుపడ్డ స్టార్ హీరో

దుబాయ్: అమెరికా అధ్యక్ష పదవికోసం పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ విరుచుకుపడ్డారు. ముస్లింలకు వ్యతిరేకంగా ట్రంప్ వ్యాఖ్యలు,  అమెరికన్లలో ఇస్లామోఫోబియాలపై మండిపడ్డారు. తన తాజా సినిమా 'సూసైడ్ స్క్వాడ్' ప్రమోషన్ లో భాగంగా దుబాయ్ వచ్చిన విల్ స్మిత్ ట్రంప్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.

'ట్రంప్ మాటలు తీవ్రంగా బాధపెడతాయి. అమెరికన్లు ఆయన చెప్పే మాటలు వింటుండటం విభ్రాంతికరం. అయితే ట్రంప్ వ్యాఖ్యలు వినడం ద్వారా అవి ఎంత క్రూరంగా ఉంటయో తెలుసుకోవచ్చు. తద్వారా ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని ప్రజలు గ్రహిస్తారు. చెత్తవాడుగుగాళ్లని దేశం నుంచి ఊడ్చిపారేస్తారు'అని విల్ స్మిత్ అన్నారు. ప్రస్తుతం తాను దుబాయ్ (ఇస్లామిక్ దేశం)లో ఉన్నానని, ఇక్కడ తన సినిమాలను ప్రదర్శిస్తున్నానని, సమయాన్ని ఆనందంగా గడుపుతున్నానని అంటే దీని అర్థం ముస్లింలు నన్ను ద్వేషిస్తున్నట్లా? అని వ్యంగ్యబాణాలు వేశారాయన.