వణికిస్తున్న చలి

29 Dec, 2015 02:44 IST|Sakshi
వణికిస్తున్న చలి

లంబసింగిలో 3, ఆదిలాబాద్‌లో 8 డిగ్రీలు

 సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలు చలికి గజగజ వణుకుతున్నాయి. ఉత్తర, ఈశాన్య గాలులు ఉధృతమవుతుండడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి.  సాధారణం కంటే తెలంగాణలో 2 నుంచి 4, ఆంధ్రప్రదేశ్‌లో 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా రికార్డవుతున్నాయి. సోమవారం విశాఖ జిల్లా లంబసింగిలో 3, పాడేరులో 5, చింతపల్లిలో 6, తెలంగాణలోని ఆదిలాబాద్‌లో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైయ్యాయి. మరో నాలుగైదు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రానున్న 4 రోజులు తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు వీస్తాయని ఐఎండీ సోమవారంరాత్రి విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా