ఐటీ రంగానికి ఏమైంది?

20 Jul, 2016 13:42 IST|Sakshi
ఐటీ రంగానికి ఏమైంది?

ముంబై: విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా ఐటీ  దిగ్గజాలు ఆర్థిక  ఫలితాలను నమోదు చేయడంతో   దేశీయస్టాక్ మార్కెట్ లో  ఐటి రంగం తీవ్ర నష్టాలను ఎదుర్కోంటోంది.  టాప్  ఐటీ  కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలు  నిరాశాజనకంగా ఉండడం ఈ పరిణామానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో మార్కెట్ విశ్లేషకులు  ఐటీ రంగం మరింత నెగిటివ్ గానే ఉండనుందనే అభప్రాయం వ్యక్తం  చేస్తున్నారు.  ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పోటీతత్వం  ఐటీ కంపెనీలను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో వివిధ ఎనలిస్టులు ఐటీ రంగ షేర్లకు దూరంగా ఉంటేనే  మేలని సూచిస్తున్నారు.

మరోవైపు అమెరికా  ఎన్నికల ఫలితాలు  ఐటీ  రంగాన్ని భారీగా ప్రభావితం చేయనుంది.  అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థిగా  రిపబ్లికన్ పార్టీనుంచి  డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారు కావడం కూడా  ఒక హెచ్చరిక లాంటిదని  మార్కెట్ వర్గాల భావన. ఒక వేళ ట్రంప్   ప్రెసిడెంట్  గా ఎన్నికైతే  భారత ఐటీ కంపెనీలకు భారీ కష్టాలు తప్పవని పేర్కొంటున్నారు. బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో షార్ట్ పీరియడ్ లో  టీసీఎస్  కు మరిన్ని కష్టాలు తప్పవని  ఎనలిస్టులు అంటున్నారు. మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని  రెలిగేర్,   షేర్ ఖాన్  తదితర   బ్రోకరేజ్ సంస్థలు  సూచిస్తున్నాయి. అమెరికా  ఎన్నికల ఫలితాలు ఐటి కంపెనీలపై  ప్రతికూల ప్రభావాన్ని చూపించనున్నాయని  ఎనలిస్ట్ పశుపతి అద్వానీ పేర్కొన్నారు.

మరోవైపు  ఐటీ మేజర్ కంపెనీలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, మైండ్ ట్రీ  ఆర్థిక ఫలితాలు మదుపరులను నిరాశపర్చాయి. మార్కెట్లో భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. దీంతో   ఫలితాల తర్వాత ఇన్ఫోసిస్ 11  నెలల కనిష్టానికి, మైండ్ ట్రీ  షేర్లు  52 వారాల కనిష్టానికి పడిపోయాయి. మంగళవారం ఫలితాలను ప్రకటించిన విప్రో  బుధవారం ఉదయం ట్రేడింగ్  సమయానికి 7 శాతం పైగా నష్టపోగా, ఇన్ఫోసిస్,  స్వల్ప నష్టాలతోనూ, మైండ్ ట్రీ  టీసీఎస్  స్వల్ప లాభాలతోనూ కొనసాగుతున్నాయి.
 

>
మరిన్ని వార్తలు