ఎస్‌ఎంఈ లిస్టింగ్‌తో చిన్న సంస్థలకు పెట్టుబడులు

6 Oct, 2015 00:04 IST|Sakshi
ఎస్‌ఎంఈ లిస్టింగ్‌తో చిన్న సంస్థలకు పెట్టుబడులు

విజయవాడ: స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎస్‌ఎంఈ) విభాగంలో పబ్లిక్ ఇష్యూ జారీచేయడం ద్వారా చిన్న కంపెనీలు వ్యాపారాభివృద్ధికి బయట నుంచి పెట్టుబడులు పొందవచ్చని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) బిజినెస్ డెవలప్‌మెంట్ చీఫ్ రవి వారణాసి చెప్పారు. సోమవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో  ఆయన ఎస్‌ఎంఈ లిస్టింగ్‌తో చేకూరే ప్రయోజనాలను వివరించారు. రూ. 25 కోట్లలోపు చెల్లింపు మూలధనం ఉండే సంస్థలు ఎన్‌ఎస్‌ఈకి చెందిన ఎస్‌ఎంఈ విభాగంలో లిస్ట్ కావొచ్చని చెప్పారు. ఎస్‌ఎంఈలోకి వచ్చే కంపెనీలకు సంబంధించి గత మూడేళ్ల ట్రాక్ రికార్డు పరిశీలిస్తారన్నారు.

పబ్లిక్ ఇష్యూలకు వచ్చే చిన్న కంపెనీలు దీని ద్వారా వస్తే మేలు జరుగుతుందని చెప్పారు. విజయవాడలో 20 కంపెనీలు ఎస్‌ఎంఈ ఫండింగ్‌లోకి రావటానికి ఆసక్తి చూపాయని చెప్పారు.  వ్యాపారులు తమ వ్యాపార అభివృద్ధికి బ్యాంకు లోన్లు లేకుండా ఎస్‌ఎంఈకి అనుగుణంగా అన్నీ సిద్ధం చేసుకుంటే దీని ద్వారా ఇష్యూకి వెళ్ళి నిధుల్ని సమీకరించుకోవొచ్చని చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు