మహిళ కిడ్నాప్ ఆపై సామూహిక అత్యాచారం

5 Feb, 2014 11:51 IST|Sakshi
మహిళ కిడ్నాప్ ఆపై సామూహిక అత్యాచారం

దేశంలో మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తున్నాయి. నిందితులను శిక్షించేందుకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి. అయిన మహిళలపై అత్యాచారాలు మాత్రం అడ్డు అదుపు లేకుండా నిరంతరాయంగా కొనసాగుతునే ఉన్నాయి. అందుకు ఉత్తరప్రదేశ్లో మంగళవారం చోటు చేసుకున్న సంఘటనే తాజా ఉదాహరణ. ఉత్తరప్రదేశ్ పోలీసుల కథనం ప్రకారం.... రాష్ట్రంలోని లలిత్పూర్లో ఓ యువతి ప్రభుత్వేతర సంస్థలో విధులు నిర్వర్తిస్తుంది. ఆ యువతి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు.

 

ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దాంతో బాధితురాలు లలిత్పూర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా మనోజ్ సమయ్య, బబ్లూ, మరోకరని పోలీసులు నిందితులను గుర్తుంచారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.  సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు