అత్తను టెర్రస్‌ మీద నుంచి తోసేసింది..

26 Jun, 2017 09:29 IST|Sakshi
అత్తను టెర్రస్‌ మీద నుంచి తోసేసింది..
ఇటాహ్‌‌: ఉత్తరప్రదేశ్‌లో ఆస్తి కోసం ఓ కోడలు దాష్టికానికి ఒడిగట్టింది. బంధుత్వాన్ని మరవడమే కాకుండా, వృద్ధురాలు (85) అని కూడా కనికరం లేకుండా కోడలు దారుణంగా ప్రవర్తించింది. ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రర్‌ చేయలేదన్న అక్కసుతో ...అత్తగారిని టెర్రర్‌ మీద నుంచి బయటకు తోసేసింది. ఈ ఘటనలో గాయపడ్డ బాధితురాలని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 
గత కొంతకాలంగా ఇంటిని తమ పేరు మీద రాయాలని అత్తను వేధింపులకు గురి చేస్తున్నప్పటికీ, ఆమె ఒప్పుకోకపోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు ఇటాహ్ పోలీసులు వెల్లడించారు. కోడలుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా