విడాకుల నోటిసిచ్చిన భర్తపై ఫిర్యాదు

19 Aug, 2015 20:46 IST|Sakshi

యాకుత్‌పురా(హైదరాబాద్): వివాహమై ఏడాదైనా భర్త పట్టించుకోవడం లేదని ఓ మహిళ రెయిన్‌బజార్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. ఎస్సై గోవింద్ స్వామి తెలిపిన వివరాల ప్రకారం... యాకుత్‌పురా ఎస్సార్టీ కాలనీ ప్రాంతానికి చెందిన సబా జహేరా (28)తో ఓల్డ్ మలక్‌పేట్ ప్రాంతానికి చెందిన జునైద్ అలీ (32)తో గత ఏడాది ఆగస్టు 1న వివాహం జరిగింది. ఇరువురికి అది రెండో వివాహం. కాగా అదే నెల 20న జునైద్ అలీ జహేరాను ఇక్కడే వదిలి దుబాయ్‌కు వెళ్లాడు.

అప్పట్నుంచి నగరానికి రాకపోగా జహేరాను కూడా తీసుకెళ్లలేదు. ఈ నేపథ్యంలో జునైద్ అలీ ఇటీవల విడాకులు కావాలంటూ నోటీసులు పంపాడాని జహేరా ఫిర్యాదులో పేర్కొంది. తనను ఏడాది నుంచి పట్టించుకోకుండా ప్రస్తుతం విడాకుల నోటీసు పంపిన భర్తపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు