గృహిణిని నిర్బంధించి సామూహిక అత్యాచారం

21 Apr, 2014 20:33 IST|Sakshi

ఠాణే: మహిళలపై మృగాళ్ల ఆగడాలు రోజు రోజుకూ శృతిమించుతూనే ఉన్నాయి. అత్యాచార ఘటనలకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా వారి ఆకృత్యాలకు హద్దూ అదుపు లేకుండా పోతుంది.  జిల్లాలోని దివాలో ఓ గృహిణిపై ముగ్గురు వ్యక్తులు పలుమార్లు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ మధ్యలో  ఆమెను తన ఇంట్లోనే బంధించి పలుమార్లు ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బాధితురాలిని  బెదిరించారు. ఈ నేరం చేసేలా నిందితులను ప్రేరేపించిన ఓ మహిళపై కూడా పోలీసులు కేసు నమోదుచేశారు. 

 

నిందితులు బట్టూ, బలియా, వారి స్నేహితుడు గుర్తించారు. బాధితురాలి భవనంలోనే ఉంటున్న సోనియా అనే మహిళ ఆ ముగ్గురు దుండగులకు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.


 

మరిన్ని వార్తలు