-

ముజఫర్నగర్ రాళ్ల దాడిలో మహిళకు తీవ్రగాయాలు

12 Oct, 2013 11:33 IST|Sakshi

ముజఫర్నగర్ జిల్లాలోని కవల్ పట్టణంలో గత రాత్రి రామ్లీలాలో జరుగుతున్న సదస్సుపై ఆగంతకులు రాళ్ల దాడిలో మహిళ తీవ్రంగా గాయడిందని పోలీసు ఉన్నతాధికారి ముఖేష్ చంద్ర మిశ్రా శనివారం వెల్లడించారు. ఆమెను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మరింత మెరుగైన వైద్య సహాయం కోసం ముజఫర్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారన్నారు.

 

కాగా రాళ్ల దాడి జరిగిన వెంటనే కొద్దిపాటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని, అయితే  అదనపు బలగాలను హుటాహుటిన రప్పించి స్థానికంగా మోహరించడంతో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. రాళ్ల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ముజఫర్నగర్లో గతనెలలో చోటు చేసుకున్న మత ఘర్షణల్లో 62 మంది మరణించారు. అలాగే 43 వేల మంది నిరాశ్రయులు అయిన సంగతి తెలిసిందే.   
 

మరిన్ని వార్తలు