విజయవాడలో దింపుతామని చెప్పి..

4 Mar, 2017 03:18 IST|Sakshi
విజయవాడలో దింపుతామని చెప్పి..

- క్యాబ్‌లో యువతిపై లైంగికదాడికి యత్నం
- ఎల్బీనగర్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన
- నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
- నిందితుల్లో ఒకరు ఇటీవల కానిస్టేబుల్‌గా ఎంపిక


సాక్షి, హైదరాబాద్‌:
క్యాబ్‌లో ప్రయాణిస్తున్న యువతిపై డ్రైవర్, మరో యువకుడు లైంగిక దాడికి యత్నించారు. ఈ ఘటన హైదరాబాద్‌ శివారులోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ కేసును  ఛేదించిన రాచకొండ కమిషరేట్‌ పరిధిలోని స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ పోలీసులు నిందితు లిద్దరిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు ఇటీవల విడుదలైన కానిస్టేబుల్‌ ఫలితాల్లో ఏఆర్‌ విభాగానికి ఎంపిక య్యాడు. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ ఎం.భగవత్‌ శుక్రవారం వివరాలు వెల్లడించారు.

గుంటూరు వెళ్లేందుకు బయలుదేరి...
గుంటూరుకు చెందిన ఓ యువతి మాదాపూర్‌లో హెయిర్‌ స్టైలిస్ట్‌గా పనిచే స్తోంది.  ఆమె బుధవారం తెల్లవారు జామున  మాదాపూర్‌ నుంచి రిజిస్టర్డ్‌ క్యాబ్‌లో బయలుదేరి ఎల్బీనగర్‌ చౌరస్తాకు చేరుకుంది. విజయవాడ వెళ్లేందుకు వాహనాల కోసం ఎదురు చూస్తుండగా ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న నాగోల్‌ జయపురికాల నీకి చెందిన దంతూరి వేణు (25), నేరేడ్‌ మెట్‌కు చెందిన బి.ఇమ్మానియేల్‌(25) ఆమెను గమనించారు. ఆమె విజయవాడ వెళ్ళే ప్రయ త్నాల్లో ఉన్నట్లు గమనించి కుట్ర పన్నారు. సమీపంలోని హోటల్‌లో ఉన్న తమ స్నేహి తుడు నిల్సన్, అతడి స్నేహితుడైన క్యాబ్‌ డ్రైవర్‌ రవితేజ వద్దకు వెళ్లారు. వారి వద్ద ద్విచక్ర వాహనం వదిలి బలవంతంగా క్యాబ్‌ తీసుకున్నారు. డ్రైవింగ్‌ సీటులో ఉన్న వేణు తాము విజయవాడ వెళ్తు న్నామని యువతితో చెప్పాడు. ఆ క్యాబ్‌లోనే ఉన్న ఇమ్మానియేల్‌ను మరో ప్రయాణికుడిగా భావించి ఆమె అందులోకి ఎక్కింది. కారు విజయవాడ హైవే పైకి చేరిన తర్వాత వేణు, ఇమ్మానియేల్‌ మాట్లాడుకోవడం ఆమె గమనించింది.

దీంతో కారు ఆపాలని కోరినా వారు పట్టించు కోలేదు. హయత్‌నగర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి య త్నించడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో ఇమ్మానియేల్‌ కారు దిగి పారిపోయాడు. కారు ను ముందుకు తీసుకు వెళ్ళిన వేణు నల్లగొండ జిల్లా పంతంగి టోల్‌గేట్‌ సమీపంలోకి చేరు కున్నాడు. అక్కడ టోల్‌ట్యాక్స్‌ చెల్లించడానికి కారు ఆపాల్సి వస్తుం దని, అప్పుడు యువతి గోల చేస్తే ఇబ్బందని భావించి టోల్‌గేట్‌కు కాస్త దూరంలో యువ తిని బలవంతంగా రోడ్డు పైకి తోసేసి వెనక్కి వచ్చేశాడు.

రంగంలోకి దిగిన ఎస్‌వోటీ
బాధితురాలు ఆ కారు నంబర్‌ను ఏపీ28టీవీ0051గా నమోదు చేసుకుని కంట్రోల్‌ రూమ్‌ ద్వారా చౌటుప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ నర్సింగ్‌రావు కారు చిరునామాను ఛేదించి యజమానిని గుర్తించారు. కొత్తూరులో ఉండే యజమాని శివకుమార్‌ రెండు రోజుల క్రితమే కారును రవితేజకు లీజుకు ఇచ్చారు. శివకుమార్‌ ద్వారానే రవితేజకు ఫోన్‌ చేయించి దిల్‌సుఖ్‌నగర్‌కు పిలిపించారు. రవితేజ ఇచ్చిన సమాచారం మేరకు నిందితులు ఇమ్మానియేల్, వేణులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించారు. పోలీసులు కేసును ఎల్బీనగర్‌ ఠాణాకు బదిలీ చేసి నిందితుల్ని అరెస్టు చేశారు. కారుతోపాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు