రాజ్నాథ్ ప్రసంగం.. మహిళా పోలీసు అపస్మారకం

16 Feb, 2015 19:39 IST|Sakshi

దేశ రాజధానిలో సాధారణ మహిళలకే కాదు పోలీసు అధికారులకూ తిప్పలు తప్పట్లేదు! మహిళల రక్షణే ప్రధాన లక్ష్యమని చెప్పే ఢిల్లీ పోలీసుశాఖ తీరులో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సరిపడా సిబ్బందిని నియమించకపోవడంతో సర్వీసులో ఉన్న ఉద్యోగినులపై ఒత్తిడి పెరిగింది. సోమవారం ఢిల్లీ పోలీస్ రైజింగ్ డే పరేడ్లో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ.

పరేడ్కు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సరిగ్గా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఏసీపీ నియతి మిట్టల్ సొమ్మసిల్లి పడిపోయారు. పరేడ్ నిర్వహణ కోసం కొన్ని రోజులుగా శ్రమించిన ఆమె బాగా అలసిపోవడంతో పడిపోయారని సహ ఉద్యోగినులు తెలిపారు. అయితే అధికారిణి పడిపోవడాన్ని చూసి కూడా పట్టించుకోనట్లే రాజ్నాథ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు! 'మహిళా అధికారిణి సొమ్మసిల్లడంలో వింతేముంది? అయినా మా డిపార్ట్మెంట్లో ఇలాంటివి సహజం' అంటూ విషయాన్ని చాలా తేలిగ్గా తీసిపారేశారు అక్కడున్న మగ పోలీసులు.

మరిన్ని వార్తలు