విమానంలో హెడ్‌ఫోన్‌ పేలితే..

15 Mar, 2017 17:20 IST|Sakshi

గెలాక్సీ నోట్‌ 7 స్మార్ట్‌ ఫోన్‌ బ్యాటరీ పేలుళ్లతో  బెంబేలెత్తిన వినియోగదారులకు మరో షాకింగ్‌ న్యూస్‌. తాజాగా ఆస్ట్రేలియా విమానంలో  ప్రయాణిస్తున్న మహిళ...ఇయర్‌ ఫోన్స్‌ లో సంగీతం వింటుండంగా  సడన్‌ గా   పేలిపోవడం ఆందోళకు దారి తీసింది.  విమానాల్లో బ్యాటరీతో పనిచేసే పరికరాల ప్రమాదాల గురించి తరచూ హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ   ఈ సంఘటన చోటు చేసుకుందని బుధవారం అధికారులు తెలిపారు.

ఫిబ్రవరి 19న  బీజింగ్‌ నుంచి మెల్‌బోర్న్‌ వస్తుండగా  ఓ మహిళ ఆ హెడ్‌ ఫోన్స్‌ అకస్మాత్తుగా  పెద్ద శద్దంతో పేలిపోయాయి.  మ్యూజిక్‌ వింటుండగా సడెన్‌ పేలిపోయాయయనీ, చిన్న చిన్న  నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయని దీంతో నా ముఖమంతా కాలిపోతున్న అనుభూతి కలిగిందని తెలిపింది. తన మెడచుట్టూ ఉన్న హెడ్‌ ఫోన్‌ ఒక్క ఉదుటున విసిరికొట్టానంటూ తన భయంకర అనుభవాలను ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో కి నివేదించింది.  దీంతో పాటు నల్లబడిన ముఖం ,  చేతులు, మెడపైన బొబ్బల్ని  అధికారులకు  చూపించిందా మహిళ.  విమాన సహాయకులు వచ్చి బకెట్‌ నీళ్లు గుమ్మరించినా, అప్పటికే బ్యాటరీ, దాని కవరు మొత్తం  కరిగిపోయి  ఫ్లోర్‌కు అతుక్కుపోయిందని చెప్పింది.

అలాగేకరిగిన ప్లాస్టిక్, కాలిన ఎలక్ట్రానిక్స్, కాలిన జుట్టు లాంటి వాసనను తోటి ప్రయాణికులు భరించలేకపోయారని తెలిపింది. మొత్తం అక్కడున్నవారంతా దగ్గుతూ  ఊపిరి ఆడక   ఇబ్బంది పడ్డారని చెప్పింది.   

కాగా విమానాల్లో ఇటీవల ఇలాంటి  పేలుళ్ల ఘటనలు బాగా పెరిగాయి. విమాన ప్రయాణాల్లో  బ్యాటరీలతో  పనిచేసే డివైస్‌ లను సంబంధిత లగేజ్‌  ఏరియాలలో దాచి పెట్టడం లేదా వాడకుండా ఉండడం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.  విచారణలో  లిథియం బ్యాటరీ మూలంగా ఈ  పేలుడు సంభవించిందని అధికారులు తేల్చారు.
 

మరిన్ని వార్తలు