హైదరాబాద్‌లో మహిళా దొంగల ముఠా హల్‌చల్

16 Oct, 2015 16:36 IST|Sakshi

హైదరాబాద్ నగరంలో గురువారం మహిళా దొంగల ముఠా రెచ్చిపోయింది. వరుస దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంది. ప్రధానంగా  ఆలయాలకు వచ్చే  మహిళలను టార్గెట్ చేస్తూ ఈ ముఠా సభ్యులు దొంగతనాలకు పాల్పడ్డారు. ముగ్గురు మహిళా సభ్యుల దొంగల ముఠా ఆగడాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.

బల్కంపేట ఎల్లమ్మ  ఆలయంలో ఓ మహిళ మెడలోని గొలుసును అపహరించిన ముఠా.. అనంతరం అమీర్పేటలోని కనకదుర్గ ఆలయంలో
పూర్ణ చంద్రావతి అనే మహిళ మెడలో నుంచి 2 తులాల గొలుసును, యూసుఫ్ గూడలో ఆటోలో ప్రయాణిస్తున్న కనకమ్మ
అనే మహిళ  వద్దనుంచి 5 తులాల బంగారు గొలుసును అపహరించారు. వరుస చోరీలను సీరియస్గా తీసుకున్న పోలీసులు
ఆ ముఠా కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు