- ఖండంలోనే అతిపెద్ద ఆకాశహార్మ్యం ‘ది పినాకిల్’
నైరోబీ: ఒకప్పటి ‘చీకటి ఖండం’ ఇప్పుడు సరికొత్త కాంతులను విరజిమ్ముతోంది. ఆకాశహార్మ్యాల నిర్మాణంతో అదరగొడుతోంది. పశ్చిమ, తూర్పు ఆసియాలోని యుఏఈ, చైనా లాంటి దేశాల్లోని అతిపెద్ద నిర్మాణాలకు ధీటుగా కాకపోయినా, సమీప భవిష్యత్తులో ఆ స్థాయిని అందుకోగలనన్న సంకేతాలిస్తోంది. అందుకు నిదర్శనమే.. కెన్యా రాజధాని నైరోబీలో రూపుదిద్దుకుంటోన్న ‘ది పినాకిల్’!
980 అడుగుల ఎత్తుండే ‘ది పినాకిల్’ హార్మ్యం.. ఆఫ్రికా ఖండంలోనే అతిపొడవైన నిర్మాణంగా రికార్డులకెక్కనుంది. 72 అంతస్తుల భారీ భవంతిని, దానిని ఆనుకునే 45 అంతస్తులుండే మరో భారీ భవంతిని కలిపి ‘ది పినాకిల్’ హార్మ్యంగా వ్యవహరిస్తున్నారు. పెద్ద భవంతి పొడవు.. 980 అడుగులు (300 మీటర్లు). అంటే, ఇంచుమించు పారిస్‌లోని ఈఫిల్ టవర్(304 మీటర్లు) ఎత్తన్నమాట! కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా ఇటీవలే నిర్మాణ పనులను ప్రారంభించారు. 2019 నాటికి ‘ది పినాకిల్’ నిర్మాణం పూర్తికానుంది.
‘ది పినాకిల్’ ప్రత్యేకతలు కొన్ని..