ఎవరికెంత లాభం?

25 Dec, 2015 09:34 IST|Sakshi
ఎవరికెంత లాభం?

అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు విపరీతంగా తగ్గాయి. ఏడాదిన్నర కిందటితో (జూన్ 2014) పోలిస్తే ఏకంగా 70 శాతం పతనమయ్యాయి. పదకొండేళ్ల కనిష్టానికి పడిపోయి... ఈ వారం బ్యారెల్ (159 లీటర్లు) ముడి చమురు ధర 36 డాలర్లకు పతనమైంది. చమురు దిగుమతి బిల్లులు తగ్గడం మూలంగా భారత్‌కు ఆర్థికంగా బాగా కలిసి వస్తోంది. దీంట్లో జనం కంటే ఎక్కువగా ప్రభుత్వమే లబ్దిపొందింది. మోర్గాన్ స్టాన్లీ మంగళవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎవరికెంత లాభమో అంకెల్లో చూద్దాం...
 
 3,10,000 కోట్లు

  • 2012లో భారత్ చమురు దిగుమతి  బిల్లు రూ. 7,12,000 కోట్లు.
  • 2015లో ఇది రూ. 4,02,600 కోట్లకు పడిపోయింది.
  • అంటే అంతర్జాతీయంగా చమురు ధరల పతనం మూలంగా భారత్‌కు ప్రతియేటా దాదాపు 3 లక్షల కోట్లు ఆదా అవుతోంది.

 1,78,000 కోట్లు

  • కేంద్ర ప్రభుత్వానికి మిగిలిన మొత్తం. చమురు బిల్లు తగ్గడంతో కేంద్రంపై 1,78,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం తగ్గింది. అంటే ఈ మేరకు పెట్రో దిగుమతులపై వెచ్చించే మొత్తం తగ్గిందన్నమాట.
  • 2014 నుంచి ఇప్పటిదాకా (ఏడాదికాలంలో) ఎక్సైజ్ డ్యూటీ పెంపు ద్వారా 92,400 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరాయి.

 79,200 కోట్లు

  •  చమురు, దాని సంబంధిత ముడిపదార్థాలను ఉపయోగించుకొనే పరిశ్రమలపై 79,200 కోట్ల భారంతగ్గింది.

 52,800 కోట్లు
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 70 శాతం మేర పతనమైనా... భారత ప్రజలకు దీని లాభాలు పూర్తిగా చేరడం లేదు. పెట్రోలు,
డీజిల్ ధరలు 20 శాతం మేరకే తగ్గాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పన్నులు పెంచడం ద్వారా తమ పెట్రో ఆదాయం తగ్గకుండా చూసుకుంటున్నాయి. ధరల తగ్గుదల మూలంగా జనానికి మిగిలింది 52,800 కోట్లు మాత్రమే.
 
 70 % జూన్ 2014- బ్యారెల్ 115 డాలర్లు డిసెంబరు 2015- బ్యారెల్ 36 డాలర్లు
 -సెంట్రల్ డెస్క్

మరిన్ని వార్తలు