వాతావరణ న్యాయం గెలిచింది: మోదీ

13 Dec, 2015 19:57 IST|Sakshi
వాతావరణ న్యాయం గెలిచింది: మోదీ

పారిస్/న్యూఢిల్లీ: భూతాపోన్నతిని రెండు డిగ్రీల కంటే తక్కువ స్థాయికి పరిమితం చేయాలని పారిస్ వాతావరణ సదస్సులో నిర్ణయం తీసుకోవడాన్ని ప్రపంచ దేశాల నాయకులు స్వాగతించారు. వాతావరణ న్యాయం సాధించిన విజయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్ణించారు. పర్యావరణవేత్తలు నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది.

భూమిని కాపాడుకోవడానికి పారిస్ ఒప్పందం మంచి అవకాశం, ప్రపంచానికి ఇది టర్నింగ్ పాయింట్ అని వైట్ హౌస్ నుంచి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.

'పారిస్ ఒప్పందంలో గెలిచినవారు, ఓడినవారు లేరు. వాతావరణ న్యాయం గెలిచింది. పచ్చని భవిష్యత్ కోసం మనమంతా కలిసి పనిచేయాలి. భూతాపోన్నతిని 2 డిగ్రీల కంటే తక్కువకు పరిమితం చేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు 2020 నుంచి వర్ధమాన దేశాలకు 100 బిలియన్ డాలర్లు సహాయం చేయాలి' అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్, బ్రిటన్ ప్రధానులు కూడా పారిస్ ఒప్పందాన్ని కొనియాడారు. అయితే ఈ ఒప్పందం బలహీనంగా, సాదాసీదాగా ఉందని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్(సీఎస్ఈ) పేర్కొంది.

మరిన్ని వార్తలు