భారీ వరదలతో కోలరాడో అతలాకుతలం

15 Sep, 2013 09:47 IST|Sakshi

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అమెరికాలోని కోలరాడో రాష్టంలో వరదలు పోటెత్తాయి. ఆ వరదల ధాటికి నలుగురు మరణించారని అల్ జజిర వార్త సంస్థ ఆదివారం వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. వరద ప్రవాహ ఉధృతికి లోతట్లు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయని చెప్పింది. దాంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారని,వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారు ముమ్మర చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

 

అలాగే చాలా మంది ఆచూకీ తెలియకుండా పోయారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వివరించింది. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు విద్యుత్, నీటి సరఫర వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ఒబామాకు విజ్ఞప్తి చేసినట్లు కోలరాడో రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు ఈ సందర్బంగా తెలిపారు.

 

వరదలు ముంచెత్తె ప్రాంతాలను గమనించి ఇప్పటికే పలు ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తు చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను యూఎస్ జాతీయ విపత్తు నివారణ సంస్థ బాధ్యతులు తీసుకుని ముమ్మర చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు వివరించారు.

మరిన్ని వార్తలు