రూపాయికి కష్టకాలం ముగిసినట్లే...

9 Oct, 2013 02:35 IST|Sakshi

న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి విలువ స్థిరీకరణ దశకు చేరుకున్నట్లేనన్న అభిప్రాయాన్ని మంగళవారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా వ్యక్తం చేశారు. డాలర్ మారకంలో రూపాయికి తగిన విలువ 60-65 శ్రేణి అని కూడా ఆయన అన్నారు. గత ఏడాదితో పోల్చితే రూపాయి ఇప్పటికీ బలహీనంగానే ఉన్నప్పటికీ, కరెంట్ అకౌంట్ లోటు తగిన స్థాయి వద్ద  కట్టడి చేయడానికి అనుగుణమైన స్థాయిలోనే ఇది ఉందని అని ఒక చానెల్‌కు ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. కరెన్సీ నష్టాల నుంచి కంపెనీలు బయటపడ్డానికి హెడ్జింగ్ విధానం సరైనదేనన్న అభిప్రాయాన్ని మాంటెక్ వ్యక్తం చేశారు. డాలర్ మారకంలో ఆగస్టులో 68.85 స్థాయికి పడిపోయిన రూపాయి తరువాత బలపడుతూ వచ్చింది. మంగళవారంనాడు 61.79 వద్ద నిలిచింది.

మరిన్ని వార్తలు